రంగరాజన్‌పై దాడి నిందితుడికి.. 3 రోజుల కస్టడీ
రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది.
BY Vamshi Kotas17 Feb 2025 8:03 PM IST

X
Vamshi Kotas Updated On: 17 Feb 2025 8:03 PM IST
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. వీరరాఘవరెడ్డిని మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. నిందితుడిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని రాజేంద్ర నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ఎంక్వరీ జరిపిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు రేపటి నుండి మూడు రోజుల పాటు అతనిని కస్టడీకి తీసుకోనున్నారు. ఇటీవల, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి దాడి చేసినట్లు వార్తలు రావడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. రంగరాజన్‌పై దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. రంగరాజన్‌ను పలువురు రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
Next Story