Telugu Global
Telangana

రాహుల్‌..భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు?

రాహుల్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం

రాహుల్‌..భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు?
X

మా భావజాలం వేల సంవత్సరాల నాటిది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.రాహుల్ ఎవరితో కొట్లడుతారు? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటి అని విమర్శించారు. భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు అని నిలదీశారు. విదేశీయులు భారత్ మీద దండయాత్ర చేసిన వారిలాగా రాహుల్ భాష ఉన్నదని ధ్వజమెత్తారు.చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లేదా మీ అమ్మ గారి దేశం తో కలిసి భారత్ మీద పోరాటం చేస్తావా?చేతిలో రాజ్యాంగం పుస్తకం పెట్టుకుని చెప్పే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. మీకు దేశం లో ఉండటం ఇష్టం లేకపోతే ఇంగ్లాండ్ వెళ్తారా, ఇటలీ వెళ్తారా తేల్చుకోండి అన్నారు.దేశం కోసం, జాతీయతా వాదం కోసం పని చేసే బీజేపీ కి దేశ ప్రజలు ఎన్నుకున్న విషయం రాహుల్ జీర్ణించుకోలేక పోతున్నారు.ఆయన ఇప్పటికీ కూడా పరిపక్వత చెందకుండా మాట్లాడటం కనిపిస్తోందన్నారు. బీజేపీతో కొట్లాడలేక ఓడిపోయి , అయిదు సార్లు ఎంపీ గా గెలిచి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడటం బాధాకరం.ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ పార్టీ విధానం తేల్చుకోవాలన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రాహుల్‌ గాంధీ 'దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం. మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ దేశ ప్రజలందరినీ అవమానించారు. బ్రిటిష్‌ వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు దేశం ద్రోహం కిందికే వస్తాయి. ఇకనైనా పిచ్చిమాటలు వినడం ఆపాలని రాహుల్‌ ఫైర్‌ అయ్యారు.

First Published:  15 Jan 2025 8:03 PM IST
Next Story