Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, June 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    రాహుల్‌..భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు?

    By Raju AsariJanuary 15, 20252 Mins Read
    రాహుల్‌..భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

     మా భావజాలం వేల సంవత్సరాల నాటిది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

    రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.రాహుల్ ఎవరితో కొట్లడుతారు? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటి అని విమర్శించారు. భారత్ మీద ఎవరితో కలిసి కొట్లాడుతావు అని నిలదీశారు. విదేశీయులు భారత్ మీద దండయాత్ర చేసిన వారిలాగా రాహుల్ భాష ఉన్నదని ధ్వజమెత్తారు.చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లేదా మీ అమ్మ గారి దేశం తో కలిసి భారత్ మీద పోరాటం చేస్తావా?చేతిలో రాజ్యాంగం పుస్తకం పెట్టుకుని చెప్పే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. మీకు దేశం లో ఉండటం ఇష్టం లేకపోతే ఇంగ్లాండ్ వెళ్తారా, ఇటలీ వెళ్తారా తేల్చుకోండి అన్నారు.దేశం కోసం, జాతీయతా వాదం కోసం పని చేసే బీజేపీ కి దేశ ప్రజలు ఎన్నుకున్న విషయం రాహుల్ జీర్ణించుకోలేక పోతున్నారు.ఆయన ఇప్పటికీ కూడా పరిపక్వత చెందకుండా మాట్లాడటం కనిపిస్తోందన్నారు. బీజేపీతో కొట్లాడలేక ఓడిపోయి , అయిదు సార్లు ఎంపీ గా గెలిచి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడటం బాధాకరం.ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ పార్టీ విధానం తేల్చుకోవాలన్నారు.

    ఢిల్లీలో కాంగ్రెస్‌ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రాహుల్‌ గాంధీ ‘దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం. మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ దేశ ప్రజలందరినీ అవమానించారు. బ్రిటిష్‌ వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు దేశం ద్రోహం కిందికే వస్తాయి. ఇకనైనా పిచ్చిమాటలు వినడం ఆపాలని రాహుల్‌ ఫైర్‌ అయ్యారు. 

    Medak MP Raghunandan Rao Slams
    Previous Articleనీటి కేటాయింపులపై బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి
    Next Article ఆకాశంలో మెట్రోరైల్… నోరూరిస్తున్న వంటకాలు
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.