అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దుర్మార్గ చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలు రేవంత్- అదానీ వ్యవహారంపై అసెంబ్లీ. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. హైడ్రా, మూసీతో వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అని ఆయన అన్నారు.శాసన సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అమరవీరులను కీర్తిస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాట పాడారు.
ఈ సమయంలో కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా దేశపతి పాటను అనుసరిస్తూ నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్- అదానీ ఫొటోలు ముద్రించిన టీషర్టులు బీఆర్‌నేతలు నేతలు ధరించారు. అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నరు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. టీషర్టులపై సీఎం రేవంత్, అదానీ ఫొటో తొలగించి లోపలికి వెళ్లాలని వారు సూచించారు. దీనికి బీఆర్‌ఎస్ నేతలు అంగీకరించలేదు. అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో అక్కడే వారు నిరసనకు దిగారు. ‘ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం.. దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ’ తదితర నినాదాలు చేశారు.