Telugu Global
Telangana

అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు..ఎప్పటి వరకు అంటే?

జర్నలిస్టులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించినట్లు వెల్లడించింది.

అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు..ఎప్పటి వరకు అంటే?
X

రాష్ట్రంలో మరోసారి వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో మూడు నెలలు పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎస్.హరీశ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31వ తేదీతో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియ‌నుంది. త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ గ‌డువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 1, 2025 నుంచి మార్చి 31, 2025 వ‌ర‌కు అక్రిడిటేషన్ కార్డుల గ‌డువును పొడిగిస్తూ ఇప్పటికే ఆయా జిల్లాల క‌లెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సంబంధిత శాఖ అధికారులు సమాచారం అందజేశారు.

ఇప్పటికే జూన్ లో కొత్త దరఖాస్తులను తీసుకోవాల్సింది.. సెప్టెంబర్ కు పొడిగించారు. తర్వాత సెప్టెంబర్ నుంచి మరో మూడు నెలలు పొడిగించారు. తాజాగా వీటిని మరోసారి పొడిగించారు. ఈ సంవత్సరంలో ఇలా పొడిగించడం మూడోసారి. ఈ నిర్ణయం ప్రకారం.. జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేశారు. త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తున్న‌ట్లు ఐ అండ్ పీఆర్ అధికారులు తెలిపారు

First Published:  24 Dec 2024 3:48 PM IST
Next Story