Telugu Global
Telangana

హెచ్‌సీయూలో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ రిలీజ్

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీలోని 41 పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

హెచ్‌సీయూలో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ రిలీజ్
X

యూనివర్సిటీ ఆప్ హైద‌రాబాద్ 41 పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి కామ‌న్ యూనివ‌ర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET) పీజీ 2025 ద్వారా అడ్మిష‌న్లు పొందొచ్చు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు exams.nta.ac.in/CUET-PG అనే వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించేందుకు చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 2. కోర్సుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం acad.uohyd.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

First Published:  23 Jan 2025 5:30 PM IST
Next Story