Telugu Global
Telangana

కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ గురుకులం ఏర్పాటు చేయలేదు : ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని మండలిలో ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఒక్క  బీసీ గురుకులం ఏర్పాటు చేయలేదు : ఎమ్మెల్సీ కవిత
X

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫెయిర్ స్కూల్స్ ఉండేవి తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బీసి పాఠశాలలు ఏర్పాటు చేసామని 31 డిగ్రీ బిసి కళాశాలలు ఏర్పాటు చేసామని శాసన మండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని కవిత అన్నారు.

సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియింబర్స్ మెంట్ కింద రూ. 14 వేల కోట్లు విడుదల చేసిందని 2230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 450 కోట్లు ఖర్చు చేశామని కవిత స్పష్టం చేశారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు… మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత కోరారు.

First Published:  16 Dec 2024 1:21 PM IST
Next Story