జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం?
జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని తెలిపారు
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి బీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో అధికార కాంగ్రెస్ కంటే.. తమ పార్టీ సభ్యులే ఎక్కువ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ స భ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలేదని తలసాని విమర్శలు గుప్పించారు. శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టడంపై చర్చించుకున్నామని తలసాని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు.