భవిష్యత్తులో నితీష్ టీమిండియాకు కెప్టెన్ అవుతారు : కేటీఆర్
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్యూచర్‌లో టీమిండియాకు కెప్టెన్ అవుతాడని కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపాడు
BY Vamshi Kotas28 Dec 2024 7:50 PM IST
X
Vamshi Kotas Updated On: 28 Dec 2024 7:51 PM IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ 176 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ తరపున సెంచరీ చేసిన నితిష్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో టీమిండియాకు నితీష్ కెప్టెన్ అవుతాడని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు
Next Story