Telugu Global
Telangana

హెచ్‌సీఎల్ అంచలంచెలుగా పెద్దస్థాయికి ఎదిగింది

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరన్న సీఎం రేవంత్‌ రెడ్డి

హెచ్‌సీఎల్ అంచలంచెలుగా పెద్దస్థాయికి ఎదిగింది
X

దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయ మాట్లాడుతూ.. తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరన్నార. రెండుసార్లు దావోస్‌ పర్యటనల్లో రూ. 41,000 కోట్లు, రూ. 1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు.. కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్‌వన్‌ చేశాక.. రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్‌ ఎనర్జీ, లైఫ్‌ సైన్సెస్‌, బయో టెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్‌, అగ్రి ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ రైజింగ్‌ ఆగదని ప్రజలు అంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల్లో ఒకటైన ఆమేజాన్ ను ఇటీవలే ప్రారంభించాం. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా సదస్సును నిర్వహించాం. గ్లోబల్‌ కంపెనీగా హెచ్‌సీఎల్‌ టెక్‌ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 2.2 లక్షల మందికి 2.2 లక్షల మందికిపైగా ఉద్యోగులతో 60 దేశాల్లో ఆపరేట్‌ చేస్తున్నది. డిజిటల్‌, ఇంజినీరింగ్‌, క్లౌడ్‌, ఏఐ రంగాల్లో వరల్డ్‌ క్లాస్‌ ఆఫరింగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి హెచ్‌సీఎల్ అంచలంచెలుగా పెద్దస్థాయికి ఎదిగిందని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అన్నారు. అందుకే యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు.

First Published:  27 Feb 2025 1:01 PM IST
Next Story