ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
BY Vamshi Kotas24 Feb 2025 2:50 PM IST

X
Vamshi Kotas Updated On: 24 Feb 2025 2:50 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20 న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Next Story