Telugu Global
Telangana

గోషామహల్‌లో మళ్లీ కుంగిన చాక్నవాడి నాలా

గోషామహల్ నియోజకవర్గంలో చాక్నవాడి నాలా ఆరుసార్లు కుంగింది.

గోషామహల్‌లో మళ్లీ కుంగిన చాక్నవాడి నాలా
X

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో మళ్లీ చాక్నవాడి నాలా మరోసారి కుంగింది. నాలా పైకప్పు నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలోనే రోడ్డు పొడవునా ఉన్న నాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కుంగిన ప్రతీసారి అధికారులు మీద మీద మరమ్మత్తులు చేసి వెళ్లిపోతున్నారని.. కానీ అది మరల కుంగుతోందని వాహనదారులు, స్థానికులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మినెంట్‌గా నాలాను రిపేర్ చేయాలని లేదా కొత్తగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవాళ ఉదయంచాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే జరుగుతున్న దారుస్పలాం నుంచి గోషామహల్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుపై చాక్నవాడి మలుపు వద్ద ప్రధాన రహదారి రోడ్డు వైపు ఉన్న నాలా పైకప్పు కుప్పకూలింది. ఇప్పటికి ఆరుసార్లు నాలా కుంగింది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు వెళ్లిపోయిన తర్వాత ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఇప్పటికైనా తమకు పర్మినెంట్ సొల్యూషన్ చూపాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  16 Feb 2025 1:23 PM IST
Next Story