తీన్మార్ మల్లన్న స్థాయి దాటి మాట్లాడుతున్నావు జాగ్రత్త : ఎమ్మెల్యే కుంభం
చింతపండు నవీన్ కుమార్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)పై ఆ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. చింతపండు నవీన్ కుమార్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి.. మల్లను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని అన్నారు. కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. హన్మకొండ వేదికగా నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో తీన్మార్ మల్లన్న పాల్గొని రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు.
రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. నిన్న బీసీల సభలో బీసీలకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఇటీవల చేసిన కామెంట్స్ ప్రజల్లో గందరగోళానికి తెరలేపాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరుకు స్పందించకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి సొంత హస్తం పార్టీపై విమర్శలు చేయడం ఏంటని విస్తపోతున్నారు.