Telugu Global
Telangana

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

తెలంగాణలో రేషన్ కార్డులు ఈనెల 26 నుంచి జారీ చేయనున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు. కులగణనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు వచ్చినట్టు తెలుస్తొంది. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. తొలుత కులగణనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని.. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాని వారు ఈనెల 26 నుంచి మళ్లీ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

అర్హులైన వారందరికీ తప్పకుండా తెల్ల రేషన్ కార్డు అందజేస్తామని తెలిపారు. కులగణన జాబితాలో లేని వారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు, తొలగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో కొంత మందికి రేషన్ కార్డులు వచ్చినట్టు.. పంచాయతీ సెక్రెటరీలు రేషన్ కార్డులు వచ్చిన వారికి సంబంధించిన ఆధార్ కార్డుల సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు.

First Published:  18 Jan 2025 8:22 PM IST
Next Story