Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌గా మల్లు రవి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుల కన్వీర్‌గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నియామకం అయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌గా మల్లు రవి
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుల కన్వీర్‌గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నియామకం అయ్యారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలకు కన్వీనర్లను నియమించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా మల్లు రవి పేరును ఖరారు చేసింది.

ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మల్లు రవికి ఈ అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహచర ఎంపీ మల్లు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఎంపీ చామల ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

First Published:  20 Dec 2024 6:31 PM IST
Next Story