Telugu Global
Telangana

జోరుగా కోడి పందేలు..చేతులు మారుతున్న లక్షలు

సంక్రాంతి పండుగ వేళ కోనసీమ జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు

జోరుగా కోడి పందేలు..చేతులు మారుతున్న లక్షలు
X

తెలంగాణ -ఏపీ సరిహద్దులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో ఎక్కడ చూసిన పందేలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజులు ఇళ్లలో పండుగ శోభ కనిపిస్తే... గ్రామాల శివార్లు, ఖాళీగా ఉన్న పంట పొలాల్లో కోడిపందాల కోలాహలం మిన్నంటుతుంది. సంక్రాంతికి ఇది సాధారణంగా కనిపించే సీన్! అయితే, ఇదే సందట్లో పందుల పందాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ పందుల పందాలకు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం వేదికగా నిలిచింది. దేశవాళీ పందులు, సీమ పందులు.... ఇలా వేర్వేరు జాతుల పందులను బరిలో దింపి, పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం సినిమా సెట్లను తలపించేలా భారీ సెట్లను ఏర్పాటు చేశారు. విసన్నపేట మండలం తాత కుంట్ల పందెం బరులు ఏర్పాటు చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని పందాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు కోడి పందాలకు చూసేందుకు యువత పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకోవడం తో వారి కోసం భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ కోడి పందాల్లో పురుషులతో పాటు కొందరు మహిళలు సైతం పందాలు కాస్తున్నారు. దీంతో అక్కడ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

First Published:  14 Jan 2025 4:05 PM IST
Next Story