Telugu Global
Telangana

ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం..ఎస్సీలను 3 గ్రూపులుగా విభజన

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది.

ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం..ఎస్సీలను 3 గ్రూపులుగా విభజన
X

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్‌ పేర్కొంది. ఎస్సీలను గ్రూప్‌-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసింది. గ్రూప్‌-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్‌ (15 ఉపకులాల జనాభా 3.288శాతం), గ్రూప్‌-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్‌ (18 ఉపకులాల జనాభా 62.748శాతం), గ్రూప్‌-3లోని ఎఎస్సీ 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్‌ (26 ఉప కులాల జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగూణంగా రాష్ట్రంలో ఎస్సీ ఉప వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.

ఈ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదికను అందజేసింది. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మందకృష్ణ మాదిగ సుదీర్ఘకాలం పాటు చేసిన పోరాటానికి ఫలితంగా. ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో తెలంగాణలో మొదటగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా.. 11, 2024న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు కమిటీ సభ్యులుగా నియమించారు

First Published:  4 Feb 2025 6:30 PM IST
Next Story