కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూపించాలంటూ బీఆర్‌ఎస్ నేతల ధర్నా
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూపించాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన నిరసన చేపట్టారు.
బీఆర్‌ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎస్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు ఎర్రబెల్లి దయాకర్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలును పోలీసులు అడ్డుకున్నారు. అయితే, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్‌య్యారు. అరెస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. కోర్టుకు పంపకుండా సమయాన్ని విచారణ పేరుతో వృథా చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేను కలువకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
పాడి కౌశిక్‌రెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే ప్రక్రియను మార్చుకోవాలని.. లేకపోతే ఆ తల్లి ప్రతాపం చూస్తావంటూ హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రాష్ట్రాన్ని ఆంధ్రకు అమ్ముతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను మార్చలేరని.. చరిత్రలో రేవంత్‌రెడ్డిలాంటి పాలకులు ఎందరో మట్టికరిచారని వారు హెచ్చారించారు.