కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ పేరు మార్పు
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌కు పేరును ఓమ్ని వైద్యశాల కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేసినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌కు పేరును ఓమ్ని వైద్యశాల కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేసినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ వేదికపై మెట్రోరైల్‌లో ప్రయాణికుల కోసం రూ.399తో ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, సీబీపీ, ఆర్‌బీఎస్, డాక్టర్ కన్సల్టేషన్‌తో కూడిన హెల్త్ ప్యాకేజీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మెట్రోరైల్ ప్రయాణికులతో పాటు మెట్రోలో పనిచేసే కార్మికుల కోసం ఓమ్ని వైద్యశాలలో ప్రత్యేక రాయితీని కల్పిస్తామన్నారు.
మెట్రో ప్రయాణికులకు హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.మెట్రోరైల్ సేవలలో ఓమ్ని కూడా భాగమైందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓమ్ని వైద్యశాల చైర్మన్ ఆర్‌బిఎస్ సూర్యనారాయణ రెడ్డి, మెట్రోరైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్, చీఫ్ స్టాటజీ ఆఫీసర్ మురళి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, ఓమ్ని తదితరులు పాల్గోన్నారు.