లగచర్ల బాధితులకు భరోసానిచ్చిన కేటీఆర్
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రిని లగచర్ల ఫార్మా బాధితులు కలిసి వారి గోడు చెప్పారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ వారితో చెప్పారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్.. బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు. లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్ రద్దు చేసుకుందన్నారు. కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలన్నారు.