Telugu Global
Telangana

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ విత్ డ్రా చేసుకున్నకేటీఆర్‌

హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న దేశ అత్యున్నత న్యాయస్థానం

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ విత్ డ్రా చేసుకున్నకేటీఆర్‌
X

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫార్ములా-ఈ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందునహైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్‌ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.అయినప్పటికీ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా? అంటూ కేటీఆర్ తరఫు న్యాయవాదికి గుర్తుచేసింది. దీంతో క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కేటీఆర్ న్యాయవాది కోరగా.. సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. దీంతో కేటీఆర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని.. ప్రస్తుతం కేటీఆర్‌ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సుందరం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే.. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా..? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొన్నది.

First Published:  15 Jan 2025 12:50 PM IST
Next Story