జీహెచ్ఎంసీ కార్మికులకు కేసీఆర్ మూడు సార్లు జీతాలు పెంచాడు : కేటీఆర్
కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని కేటీఆర్ తెలిపారు
కార్మికుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించి ప్రసంగించారు. బీఆర్‌ఎస్ పార్టీ 2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే.. అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడిండు. ఇలా హమాలీలతో భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీలోని కార్మికులకు మూడు సార్లు జీతాలు పెరిగాయని.. రాష్ట్రంలోని కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంగన్ వాడీ టీచర్ల జీతం 13500లకు పెంచామని.. ఆశావర్కర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వమే జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లపై లాఠీలతో దాడి చేయించిందని మండిపడ్డారు.
కరోనా సమయంలో ఇతర రాష్ట్రల కార్మికులకు వెయ్యి రూపాయాలు జేబులో పెట్టి.. అన్నం పెట్టి, ఉచితంగా రైళ్లో మీ ఇంటికాడ దింపేసి వస్తానని చెప్పిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్. అది కేసీఆర్ నాయకత్వం.. కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లపై లాఠీలతో దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఆర్పీలకు గత ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నట్లు డబ్బా కొడుతున్నాడని కేటీఆర్ అన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల కూడా గత మూడు, నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదనేది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు