Telugu Global
Telangana

కృష్ణా నీళ్లపై సీఎం, మంత్రుల ఆరోపణలు తప్పని తేలిపోయింది

ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీనే ఆ విషయం తేల్చేశారు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

కృష్ణా నీళ్లపై సీఎం, మంత్రుల ఆరోపణలు తప్పని తేలిపోయింది
X

కృష్ణా నీళ్లపై సీఎం, మంత్రులు చేస్తున్న ఆరోపణలు తప్పని తేలిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు తేల్చిచెప్పారు. కేఆర్‌ఎంబీ మీటింగ్‌ అనంతరం ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ నీటి వాటాల విషయంలో కుండబద్దలు కొట్టారని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. దీంతో కృష్ణా నీటిపై సీఎం, మంత్రుల తప్పుడు ప్రచారం ఖుల్లం ఖుల్లాగా తేలిపోయిందన్నారు. 2015లో ఒకే సంవత్సరం కోసం 34 : 66 నిష్పత్తిలో నీటి వాటాలకు ఒప్పందం చేసుకున్నామని.. క్యాచ్‌ మెంట్‌, కమాండ్‌ ఏరియా ఆధారంగా తెలంగాణకు 71 శాతం నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌ ఎదుట కోరుతున్నామని తెలిపారని గుర్తు చేశారు. నీటి వాటాలు తేల్చేవరకు 50 : 50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని కోరుతున్నామనే విషయంపైనా క్లారిటీ ఇచ్చి గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించేలా సమాధానం చెప్పారన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ లో సెక్షన్‌ 89ని పెట్టి రాష్ట్రాలకు బదులుగా ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు చేసేలా నిబంధన పెట్టింది, కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి తెలంగాణ అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని తేల్చిచెప్పారు.

First Published:  21 Jan 2025 6:24 PM IST
Next Story