సిరిసిల్లలో రైతుపై అక్రమ కేసు కేటీఆర్ చొరవతో బెయిల్
సిరిసిల్ల జిల్లాలో అన్నదాతపై అక్రమ కేసు పెట్టించడంతో కేటీఆర్ సదరు రైతుకు భరోసా కల్పించారు.

సిరిసిల్ల జిల్లాలో రైతుపై జిల్లా కలెక్టర్ అక్రమ కేసు పెట్టించి సదరు అన్నదాతను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సదరు రైతుకు భరోసా కల్పించారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ళ గ్రామానికి చెందిన రైతుకు కేటీఆర్ బెయిల్ ఇప్పించారని తెలుస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవతో బెయిల్ మీద విడుదలై ఇంటికి వచ్చిన రైతును చూసిన కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీస్టాల్ వద్ద కేటీఆర్ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్ యజమానికి బత్తుల శ్రీనివాస్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్‌ఎస్, కేటీఆర్‌కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్‌చేశారని ఆరోపించారు.