కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా.. కేటీఆర్ హామీ
తొందర్లోనే వచ్చి మళ్ళీ నేనే చాయ్ దుకాణం పెట్టించి ఓపెన్ చేస్తాని కేటీఆర్ బాధితుడు శ్రీనివాస్‌కు భరోసా కల్పించారు.

సిరిసిల్ల బతుకమ్మ ఘూటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోతో పెట్టుకున్నాడనే కక్షతో మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు తరలించారు.ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తొందర్లోనే వస్తా.. చాయ్ దుకాణం మళ్లీ నేనే ఓపెన్ చేస్తానని బత్తుల శ్రీనివాస్‌కు కేటీఆర్ హామీ ఇచ్చారు. హోటల్ నిర్వాహకుడు, బాధితుడు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు కేటీఆర్.
కేవలం కేటీఆర్ ఫొటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రేన్‌తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్‌లో తీసుకెళ్లిపోయారు. చాయ్ హోటల్ నడుపుకుంటే కాని పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రేన్‌తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్‌లో తీసుకెళ్లిపోయారు. చాయ్ హోటల్ నడుపుకుంటే కాని పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.