Telugu Global
Telangana

ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం

72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది.

ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం
X

72 వ ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాది. మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహాకులు షెడ్యూల్ విడుదల చేశారు. కాగా ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారత్‌లో జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. దశాబ్దాలుగా ఈ ఐకానిక్​ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచే ఈ ఈవెంట్ బ్రిటిష్ ప్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించింది. ప్రతిష్టాత్మక ఈ పోటీల్లో 120కిపైగా దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గోనే వారి వయస్సు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి నేరారోపణ ఉండరాదు. ఏ దేశం పుడితే ఆ దేశం తరుపున ప్రాతినిధ్యం వహించాలి.

విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తుంది. గొప్ప చేనేత వారసత్వం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. అరుదైన వంటకాలు.. విభిన్నమైన కళా వారత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్‌, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.

First Published:  19 Feb 2025 9:36 PM IST
Next Story