తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ సర్కార్‌కి తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది.
BY Vamshi Kotas17 Feb 2025 7:40 PM IST

X
Vamshi Kotas Updated On: 17 Feb 2025 7:40 PM IST
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భుములు కేటాయింపులు జరపడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్ట్.. ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది కొంత సమయం కోరగా.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది
Next Story