Telugu Global
Telangana

బీఏసీ సమావేశంపై హరీశ్‌రావు ఫైర్

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.15 రోజులు సభ నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఏసీ సమావేశంపై  హరీశ్‌రావు ఫైర్
X

తెలంగాణ సభాపతి ఛాంబర్‌లో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీనీ ఈ శుక్రవారం వరుకు 20వ తేదీ వరుకు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా శాసన సభ సమావేశలను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు డిమాండ్ చేస్తూ బీఎసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభ ఎన్నిరోజులు నడుపుతారో చెప్పడం లేదంటూ మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ‘‘ సభను కనీసం 15 రోజుల పాటు నడపాలని కోరాం. ప్రభుత్వం మాత్రం 3 లేదా 4 రోజులు నడుపుతామని చెబుతోంది. ఇటీవల సమావేశాలకు టీ షర్టులతో వస్తే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశాం.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ టీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లడం లేదా?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు. బీఏసీ లేకుండానే బిల్లులు పెట్టడం సంప్రదాయ విరుద్ధమని హరీశ్‌ విమర్శించారు.బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుందని వివరించామన్నారు. హౌస్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.బీఏసీపై తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అడిగారని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారని చెప్పారు. బీఏసీ లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశామని అన్నారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం తెలిపామని పేర్కొన్నారు

First Published:  16 Dec 2024 3:15 PM IST
Next Story