Telugu Global
Telangana

సుప్రీం తీర్పుతో తెలంగాణకు తీవ్ర నష్టం : హరీష్ రావు

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పుతో తెలంగాణకు తీవ్ర నష్టం : హరీష్ రావు
X

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై మాజీ మంత్రి హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. మెడికల్ సీట్లలో 50% లోకల్ రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిస్తుందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో, ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య విద్య అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని హరీష్ రావు గుర్తుచేశారు.

First Published:  30 Jan 2025 4:48 PM IST
Next Story