Telugu Global
Telangana

హరీశ్‌రావు.. డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?

అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌ల మధ్య వాడీవేడి సంభాషణ

హరీశ్‌రావు.. డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?
X

శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. మొదట మంత్రి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ పక్కనపెట్టిందని ఆరోపించారు. పదేళ్లలో రూ. 7 లక్ష్హల కోట్లు అప్పు చేసినా దీన్ని పూర్తిచేయలేదన్నారు. తమ ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోమటిరెడ్డి కోరారు. సీఎం, మంత్రులు అందరూ తమ జిల్లాకు అండగా నిలబడలన్నారు.

దీనికి హరీశ్‌ స్పందిస్తూ ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉండకూడదన్నారు.ఇలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. లేని సంస్కృతిని తీసుకురావద్దని స్పీకర్ను కోరారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనే. మా ప్రభు్తవ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం నీళ్లను ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట,తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించాం. దీనిపై చర్చ పెట్టండి. ఎవరేం చేశారో చర్చిద్దామని అన్నారు. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేం కలుగజేసుకోవాల్సి వస్తుంది అన్నారు. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ున్నారు.ఆయన హయాంలోనే మూసీ ఈ విధంగా తయారైందన్నారు.

అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు.. డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆయను అడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత (కేసీఆర్‌ను ఉద్దేశించి) ఏడాదిగా సభకు రాకపోవడం సభనే కాదు.. ప్రజలను అవమానపరచడమే అన్నారు. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్నవాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు కనికరం లేదు. హరీశ్ ఒక్కసారీ సొరంగం వద్దకు రాలేదు. ాయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటుగా స్పందించారు.

First Published:  19 Dec 2024 11:11 AM IST
Next Story