రేపు గ్రూప్-2 ప్రాథమిక కీ రిలీజ్
గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ విషయంలో టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది.
BY Vamshi Kotas17 Jan 2025 6:49 PM IST
X
Vamshi Kotas Updated On: 17 Jan 2025 6:49 PM IST
తెలంగాణ గ్రూప్-2 ప్రాథమిక కీ రేపు విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అభ్యంతరాలను తెలపాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story