Telugu Global
Telangana

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
X

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువవ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. తెలంగాణలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి సంవత్సరం రూ. 20వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ర్యాటక భవన్‌లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని రేవంత్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.

మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళ శక్తి బజార్ ను ప్రారంభించామని, ఇక్కడ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్ట్ అప్ కంపెనీల సేల్స్ ను ఈరోజు ప్రారంభించామని గుర్తు చేశారు.మహిళ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు స్వేచ్ఛగా మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని సీతక్క తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో మహిళ సంఘాల ఉత్పత్తులు, మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలను 17 రకాల వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని, వేయి మెగావాట్ల సౌర విద్యుత్తును మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబోతున్నామని, మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు, 150 బస్సులను కూడా మహిళలకు కేటాయించబోతున్నామని తెలిపారు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళలు అభివృద్ధి మీదే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.

First Published:  7 Dec 2024 2:54 PM IST
Next Story