ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
![ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402228-illu.webp)
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గనులు,ఖనిజాల అభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్షించారు. సామాన్య వినియోదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులకు సిమెంటు, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి, తక్కువ ధరకే అందించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక (దాదాపు 37-40 టన్నులు) అవసరం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసే మొత్తం 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.