Telugu Global
Telangana

కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరణ!

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరించింది.

కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరణ!
X

తెలంగాణలో తగ్గిన కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్దరణ బ్రూవరీస్ సంస్థ స్పందించింది. రాష్ట్రంలో కింగ్ షిషర్ బీర్ల సరఫరాపై పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. పాత బకాయిల విడుదల బేవరేజ్ కార్పొరేషన్ స్పందించి త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు, కార్మికులు, వాటదారులు ప్రయోజనం దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్ధ పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రోజు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ వెల్లడించింది. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు తమ నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తూనే ఉంటాయి.!

First Published:  20 Jan 2025 4:08 PM IST
Next Story