Telugu Global
Telangana

పోలీసు కస్టడీకి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పినిచ్చింది.

పోలీసు కస్టడీకి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
X

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పినిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.

లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం పోలీసులు.. నరేందర్‌ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌ తరలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు.

First Published:  6 Dec 2024 6:44 PM IST
Next Story