మంత్రివర్గ ఆశావహులకు షాక్.. విస్తరణ ఇప్పట్లో లేనట్టే
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
![మంత్రివర్గ ఆశావహులకు షాక్.. విస్తరణ ఇప్పట్లో లేనట్టే మంత్రివర్గ ఆశావహులకు షాక్.. విస్తరణ ఇప్పట్లో లేనట్టే](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401257-revanth-reddy.webp)
మంత్రివర్గ ఆశావహుక ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘క్యాబినేట్‌లో ఎవరు ఉండాలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన చేశాం’’ అని సీఎం వెల్లడించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డిలతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షిలతో ఆ పార్టీ అధిష్టానం ఒక్కొక్కరితో చర్చించి.. అభిప్రాయాలను సైతం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుందని.. కానీ ఇప్పుడే విస్తరణకు అవకాశం మాత్రం లేదంటూ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నట్లు టాక్. ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్‌లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.