Telugu Global
Telangana

పాల స్కూటర్ మీద మాజీ మంత్రి మల్లారెడ్డి హల్‌చల్

బోడుప్పల్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు.

పాల స్కూటర్ మీద మాజీ మంత్రి మల్లారెడ్డి హల్‌చల్
X

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి హల్‌చల్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల డబ్బా, స్కూటర్‌పై కనబడ్డ వ్యాపారిని పలకరించారు. ఆ స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మల్లారెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. తనదైన శైలి మాటలతో ఆయన అందర్నీ అలరిస్తుంటారు.

‘పూలు అమ్మినా.. పాలు అమ్మినా.. కష్టడిన.. సక్సెస్ అయిన.. ఎమ్మెల్యే అయిన.. మంత్రినైన..’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని మల్లారెడ్డి చెబుతుంటారు. ప్రజల్లో ఒకడిగా కలిసిపోవడం, యువతతో కలిసి స్టెప్పులేయడం మల్లారెడ్డి స్పెషాలిటీ. ‘వచ్చేది కారు.. ఏలేది సారు.. అతడే మన కేసీఆరు’ అంటూ ఇటీవల ఆయన చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మందికి టికెట్ నేనే ఇప్పించానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు

First Published:  16 Feb 2025 4:06 PM IST
Next Story