Telugu Global
Telangana

ఆ విషయంలో స్పష్టత వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఎమ్మెల్సీ కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు

ఆ విషయంలో స్పష్టత వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఎమ్మెల్సీ కవిత
X

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లుపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయని కవిత అన్నారు. బీసీల హక్కులపై జాగృతి తరపున పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా స్థానిక ఎన్నిల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ లో చెప్పారని గుర్తు చేశారు.

బీసీ రిజర్వేషన్లు పెంచని పక్షంలో ఎన్నికలు జరగనివ్వబోమని, మండల కేంద్రాలు, జిల్లాల్లో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపడుతామని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ హెచ్చారించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చి తరువాత, బీసీ జనాభాను వెల్లడించాకే ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. అదేవిధంగా సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తామని కవిత తెలిపారు.

First Published:  27 Dec 2024 2:48 PM IST
Next Story