దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం
కోకాపేట్‌లో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు దొడ్డి కొమురయ్య రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని సీఎం అన్నారు.‘‘కురుమలు తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ కోరిక. ఊళ్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని చెబుతా. వారికి భూమి అమ్మితే డబ్బు నడుముకు కట్టుకుని తెచ్చిస్తారు. ఈ కురుమ భవనం విద్యకు వేదిక కావాలి. దేశానికే ఆదర్శంగా కులగణన చేపడుతున్నాం. 98శాతం కులగణన జరిగింది.
కురుమలకు, యాదవులకు రెండేసి చొప్పున ఎంపీ సీట్లు ఇచ్చాం. మొదటి సారి ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చామని కొనియాడారు. అలాగే బీర్ల ఐలయ్య విప్ గా ఉండటం వల్లనే.. నేడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం.. కోకాపేటలో ఉందని తెలిపారు. అలాగే కురుమలకు సామాజిక న్యాయం జరగాలంటే.. రాజకీయంగా అవకాశం వచ్చిన వారు ఎక్కడున్నా గెలిపించుకోవాలని, అలా జరిగినప్పుడే కురుమ జాతి బాగుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి మన అమ్మకు, అక్కకు ప్రతిరూపం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.