సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూల్చివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి.

హైదరాబాద్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో నాటి కళాసంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన.. రైల్వే స్టేషన్ భవనాన్ని తాజాగా నేలమట్టం చేశారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా స్టేషన్‌లో కూల్చివేతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ హార్చ్ గోడలను నేలమట్టం చేశారు.1874 లో నిజాం, బ్రిటీష్ కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. నిజాం ఆధీనంలో ఉండే ఈ స్టేషన్.. 1950 తర్వాత భారత రైల్వే పరిధిలోకి వచ్చింది.
కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నేడు అధునీకరణ పేరుతో కూల్చి వేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే ప్లాన్ చేసింది. అత్యాధునిక హంగులతో రీ డెవలప్ చేయాలని, రూ.653 కోట్ల అంచనాతో ఎస్సీఆర్ టెండర్లకు పిలిచింది. ఇక ప్రస్తుతం వందల సంఖ్యలో రైళ్లు, దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.. స్టేషన్‌కు ఇరువైలా రెండు ట్రావెలేటర్లు, రెండు నడక మార్గాలు, స్టేషన్‌లోపలికి ప్రయాణికులు వచ్చేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు.