జాతీయ మీడియాకు క్షమాపణలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్
జాతీయ మీడియాకు క్షమాపణలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ జాతీయ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు. సంధ్య థియేటర్ ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా క్షమాపణలు చెబుతూ ట్వీట్ పెట్టారు.మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ఆయన విడుదల చేశారు. ఇక ఈ ఘటనపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు.
ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలిపే వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో నేషనల్ మీడియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతు ఇస్తోందంటూ వ్యాఖ్యానించారు. సీపీ వ్యాఖ్యలను జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు.ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయినట్లు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తాను కాస్త సంయమనం పాటించాల్సింది అన్నారు. తాను చేసింది పొరపాటుగా గుర్తించి.. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటన్నట్లు తెలిపారు. ఈ మేరకు క్షమాపణలు చెప్పారు. సీపీ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.