ప్రారంభమైన 6 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. వీటి ఫలితాల కోసం ఈరోజు బ్యాలెట్ బాక్సులను తెరిచి కౌంటింగ్ ప్రారంభిస్తారు.
కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత నెల 27న నిర్వహించిన ఎన్నికల.. ఫలితాలు ఇవాళ వచ్చే ఛాన్సు ఉంది.