Telugu Global
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన బిల్డర్ అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదు : హరీష్ రావు

ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు

కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన బిల్డర్ అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదు : హరీష్ రావు
X

ఒకప్పుడు బిల్డర్ అంటే లోన్లు ఇస్తామని బ్యాంకులు వెంటపడేవి కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన ఇప్పుడు బిల్డర్ అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వమంటూ మొహం చాటేస్తున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ అసమర్థ పాలనతో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను హరీష్ రావు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ఆయన అన్నారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య కథనం మేరకు ఏ బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం ప్రయత్నించినా బ్యాంకర్లు నీవు బిల్డర్ నీకు లోను ఇవ్వమని చెప్పారని..దీంతో భార్య పేరు మీద లోను కోసం ట్రై చేసినప్పటికి కో అప్లికెంట్ గా భర్త బిల్డర్ కావడంతో లోను ఇవ్వమని బ్యాంకర్లు చెప్పారని హరీష్ రావు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ 13నెలల పాలనలో కట్టిన అపార్ట్మెంట్ అమ్ముడుపోక..ఎక్కడా అప్పు పుట్టక ఆర్థిక ఇబ్బందులతో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్షించుకుకోవాలన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్ల సమస్యలపైన లేవనెత్తుతామని..బాధితుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజలు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవద్ధని హరీష్ రావు కోరారు.

First Published:  2 Feb 2025 5:22 PM IST
Next Story