Telugu Global
Telangana

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయండి : మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ శమీమ్ అక్తర్‌ను కోరారు.

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయండి : మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్
X

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఏబీసీబీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణ రావు భవన్‌లో మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ శమీమ్ అక్తర్ కార్యాలయంలో జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ తరుఫున వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేసి ఎస్సీ జాబితాలో ఉన్న59 కులాలతో పాటు వారికి జనాభా దామాషా ప్రకారం ఎవరికెంతో వారికి అంత వాటా ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ గత 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నారు . ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉప కులాల ప్రజల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కోటాను పెంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణక చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

First Published:  13 Dec 2024 6:16 PM IST
Next Story