తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
కేంద్రం ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ శుభవార్త చెప్పింది.
కేంద్రం ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యపేట, మేడ్చల్ జిల్లాలకు కేటాయించింది.
ఏపీలోని అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు పేరుంది. వీటిలో సీబీఎస్ఈ సిలబస్ తో బోధన ఉంటుంది. విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి.