నాంపల్లి కోర్టుకు బన్నీ తరలింపు
గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలోకి పోలీసులు ఎవరినీ డైరెక్ట్‌గా అనుమతించడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం రోగులు, వారి సహాయకులు, డాక్టర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వారి ఐడీ కార్డు చూసి నిర్థారించుకున్న తర్వాతనే ఆస్పుపత్రిలోకి అనుమతిస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల్లో బన్నీ వైద్య పరీక్షలు పూర్తికానున్నట్లు టాక్. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం పోలీసులకు రిపోర్టులు అందజేశారు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది. చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. పోలీస్ స్టేషన్ బయట ఉన్న అభిమానులను చూసి బన్నీ అభివాదం చేశారు. అలాగే గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో అల్లు అర్జున్ అభిమానులు అభివాదం చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. కోర్టు ఏం చెబుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం.