Telugu Global
Telangana

సంధ్య థియేటర్ కేసులో బన్నీ బౌన్సర్ల అరెస్ట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంధ్య థియేటర్ కేసులో బన్నీ బౌన్సర్ల అరెస్ట్
X

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంటోనీని రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నీని తొక్కిసలాట ఘటన పై గంటన్నరకు పైగా విచారించారు. న్యాయవాది అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అల్లు అర్జున్‌ను విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్‌ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్‌ షో ఎలా నిర్వహించారు..? రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కీలకమైన బౌన్సర్ల అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు. బౌన్సర్లపై పోలీసులు వేసిన ప్రశ్నలకు అల్లు అర్జున్ నుంచి సరైన సమాధానం రాలేదంట. మార్చిపోయాను నాకు తెలియదు గుర్తులేదు అని చెప్పినట్లు తెలిసింది.

First Published:  24 Dec 2024 2:31 PM IST
Next Story