Telugu Global
Telangana

లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్‌ఎస్‌ పట్టు.. శాసన సభ రేపటికి వాయిదా

తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది.

లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్‌ఎస్‌ పట్టు..  శాసన సభ రేపటికి వాయిదా
X

తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత సభ ప్రారంభం కాగా టూరిజం పాలసీపై మంత్రి జుపల్లి జూపల్లి కృష్ణారావు చర్చను ప్రారంభించారు. ఈ సమయంలో లగచర్ల ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసి పంపడంపై చర్చించాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఈ నిరసన నడుమ స్పీకర్ సభను రేపేటికి వాయిదా వేశారు.

అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొనగా.. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి.

First Published:  16 Dec 2024 2:59 PM IST
Next Story