ఫార్ములా ఈ- రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు.

ఫార్ములా ఈ- రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత గడువు కావాలని ఈడీకి మెయిల్ చేశారు. బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ కు సానుకూలంగా స్పందించిన ఈడి అధికారులు..ఆయనకు పర్మిషన్స్ ఇచ్చింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బీఎల్ఎన్ రెడ్డికి చెప్పారు ఈడీ అధికారులు.ఈ విచారణకు రావడానికి తనకు మరింత సమయం కావాలని కోరారు బీఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసు ను దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి. ఇక హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి…మెయిల్ పై ఈడీ స్పందించింది. ఇక ఇదే కేసులో శుక్రవారం అరవింద్‌కుమార్ విచారణకు హాజరుకానున్నారు. ఇక జనవరి 7న మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై విచారణ జరగనుంది