బిగ్‌బాస్-8 ఫైనల్..హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు
బిగ్‌బాస్-8 ఫైనల్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బిగ్ బాస్-8 ఫైనల్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియో వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టూడియో పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత సీజన్‌లో విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహంతో గతేడాది పరిస్థితి అదుపుతప్పిన విషయం తెలిసిందే.
అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావొద్దని సూచనలు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు వాహన రాకపోకలపై నిషేదం విధించారు. బందోబస్తు ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు బిగ్‌బాస్ నిర్వహకులదే బాధ్యత అని హెచ్చరించారు.